Afgespeeld

  • (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    అంతా నా మంచికే

    రచన : కొత్తపల్లి ఉదయబాబు

    ''ఈమధ్య ఆ మొహం ఎలా తయారైందో చూసుకున్నారా అద్దంలో?  ఎన్ని సార్లు చెప్పాలి మీకు... నా మాట వినమని?'' అంది ఆదిలక్ష్మి భర్తమీద రయ్ మని లేచింది .

    ''40 ఏళ్ల నుంచి నీ మాట వినబట్టే   చలపతి రావు అన్న నా పేరు జనాలు మర్చిపోయి ఆదిలక్ష్మి మొగుడు గారు అని పిలిపించుకుంటున్నాను... నీ పుణ్యమా అని.  60 ఏళ్లు దాటినా  నీ మాటే వినాలా ? నాకంటూ ఒక సొంత అభిప్రాయం  ఉండకూడదా?"' అన్నాడు చలపతిరావు కోపంగా.

    ''ఆ  మన పెళ్లి అయ్యేనాటికి కుక్కర్ లో ఉడికించి  ఇనిమిన ముద్దపప్పులా  ఉండేవారు. అలా పెంచింది మీ అమ్మ మిమ్మల్ని. మీ స్నేహితులందరూ ముద్దుగా బూరె అని పిలుచుకునేవారట. అలాంటి మిమ్మల్ని చాలినంత ఉప్పువేసినట్టు నలుగురిలో తిరిగే విధానం నేర్పుకుని , కొత్త హెయిర్ స్టైల్ తాలింపు పెట్టుకుని,  ఆపైన తిరగమోత వేసినట్టు    మీ అందానికి సరిపోయి రంగు రంగుల డ్రస్సెస్  కొనిపించి, మీ చేత తొడిగించి ,  ఆపైన కొత్తిమీరతో గార్నిష్ చేసినట్టు తలకు రంగు వేసి ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్లో లేటెస్ట్ హాట్ టిఫిన్  లాగా ఇన్ని రకాలుగా మిమ్మల్ని  తయారు చేసుకున్నాను  కాబట్టే అందరూ మిమ్మల్ని 'ఆదిలక్ష్మిగారు వచ్చాకా చలపతిరావు గారు చాలా మారారు ' అని అంత గౌరవిస్తున్నారు. ఆ సంగతి మర్చిపోకండి'' అంది ఆదిలక్ష్మి.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/92yiF30T78I